Posts

భోగి పండుగ

Image
భోగి  లేదా  భోగి పండుగ  అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి రకం సాంప్రదాయ ప్రాముఖ్యత శీతాకాల పండుగ జరుపుకొనే రోజు జనవరి 14 ఉత్సవాలు భోగి మంటలు సంబంధిత పండుగ సంక్రాంతి Pongal Bihu (Bhogali / Magh /Bhogi in Telugu) భోగి  లేదా  భోగి పండుగ  అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. విశేషాలు:- సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీని

వైకుంఠ ఏకాదశి

Image
Ekadasi Fasting వైకుంఠ ఏకాదశి.. ఉపవాస దీక్షతో ఈ ఫలితాలు Samayam Telugu  | Updated: 06 Jan 2020, 08:15:00 AM ఏడాది పొడువునా వచ్చే 24 ఏకాదశలలో అత్యంత ముఖ్యమైనది ముక్కోటి ఏకాదశి. ఏకాదశి అంటే శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం. అందుకే వైష్ణవ భక్తులు ఏకాదశి రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు.       హిందువుల పండుగలన్నీ చంద్రమానం లేదా సౌరమానం అనుసరించి జరుపుకునేవి అయినా, ఈ రెండింటితో సంబంధం లేకుండా చేసుకునే ఏకైక పండుగ ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి, స్వర్గపురి ఏకాదశి అంటారు. ఈ రోజున మూడుకోట్ల దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకి వస్తారని ప్రతీతి. ఏకాదశి పేరు చెప్పగానే ఉపవాసం గుర్తుకొస్తుంది. పక్షంలో ఒక్క రోజైనా భగవంతునిపై మనసు లగ్నం చేయడానికి ఏర్పరిచిన నియమమే ఏకాదశి. దీని వల్ల మనసు పరిశుద్ధం కావడం అటుంచితే, శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది శాస్త్రీయంగా రుజువైంది. ప్రతి ఏకాదశికీ ఉపవాసం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవా